హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపు తప్పిన స్కూటీ.. వ్యక్తికి గాయాలు

VZM: గజపతినగరం రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం ఉదయం NH -26పై స్కూటీ స్కిడ్‌ అవ్వడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.