BPT: జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఎన్. వెంకటరమణ అన్నారు. భట్టిప్రోలులోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 31న నియోజకవర్గం కేంద్రం వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచనలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌మేళాలో 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి'


