హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నంద్యాలో భారీ కొండచిలువ కలకలం

నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ కాలనీలో ఇళ్ల మధ్య సుమారు 10 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో మంగళవారం రాత్రి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే కాలనీవాసులు స్నేక్ క్యాచర్ రజాక్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని ఎంతో శ్రమించి కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని శివారు ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.