హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం రహదారులకు మహర్దశ

ELR: పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. బుట్టాయిగూడెం-ఎల్ఎన్డీ పేట, పట్టిసీమ—కొవ్వూరు మార్గాల్లో 45.09 కి.మీ. మేర ఎన్హెచ్–365బీబీ రహదారిని రూ.840.41 కోట్లతో రెండు లేన్లుగా, పేవ్డ్ షోల్డర్లతో అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో పోలవరం రాకపోకలు సులభతరం కానున్నాయి.