హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

TPT: కోటపోలూరు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో శ్రీనివాసులు భార్య సంధ్యను పొలాల్లో రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని చీరలో మూటకట్టి బైక్‌పై ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.