హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలకు జలదిగ్బంధంలో గ్రామాలు

ASR: జిల్లా ముంచంగిపుట్టు మండలంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గిరిజన గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెట్టగుడ, తుమిడిపుట్టు గ్రామాల ప్రజలు ఇంటివద్దే ఉండిపోయారు. వంతెనల నిర్మాణాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.