హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈద్ ముబారక్' తెలిపిన ప్రధాని మోదీ

'మిలాద్-ఉన్-నబీ' పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర సందర్భం మన చుట్టూ ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. దయతో మెదలడం, సమాజానికి తిరిగి సేవ చేయడం అనే గొప్ప స్ఫూర్తి ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకం కావాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.