KDP: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బుధవారం గ్రామస్థులు బావి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన బావిని శుభ్రం చేసి మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సుమారు 134 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బావి 72 అడుగుల లోతు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాతిరెడ్డిపల్లెలో బావి గంగమ్మకు ప్రత్యేక పూజలు


