కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న శ్రీ సుబ్బాలమ్మ-నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వడ్డెర సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, పానకం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తీన్మార్ డప్పులు, శక్తి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా సుబ్బాలమ్మ-నూకాలమ్మ జాతర


