హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ గోపుర నిర్మాణానికి విరాళం

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం గ్రామ దేవత శ్రీ చెవిటమ్మ తల్లి దేవాలయ గోపుర నిర్మాణానికి కూన భరత్ విజయ్ రూ.25,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్కు రూపంలో విరాళాన్ని ఆలయ నిర్వాహకులు కూన భానుజీరావు కి అందించారు. ఆలయ నిర్మాణ పనులకు భక్తులు విరాళాలు అందించి సహకరించాలని నిర్వాహకులు కోరారు.