కృష్ణా: బంటుమిల్లి పంచాయతీ కార్యాలయం పక్కనుంచి జానకిరామపురం వెళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయమైంది. ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. స్థానికుల ఆందోళన నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, మురుగునీరు తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంతలమయంగా రోడ్డు.. ప్రమాదాలకు నిలయం


