హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేగవంతంగా వెలిగొండ ప్రాజెక్ట్ పనులు!

ప్రకాశం: ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేయనున్న నేపథ్యంలో పెండింగ్ పనులను అధికారులు వేగవంతం చేశారు. ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడటంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గంటవానిపల్లి సమీపంలోని ఫీడర్ కెనాల్ వద్ద పగలు రాత్రి తేడా లేకుండా సిబ్బంది పనుల్లో నిమగ్నమై ప్రాజెక్ట‌ు ప్రారంభానికి వస్తున్నారు.