హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ వివాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

KDP: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద చిట్టిబోయిన శ్రీనివాసులను గొడ్డలితో నరికి హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదాల నేపథ్యంలో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహానందిపల్లె, బ్రాహ్మణపల్లె, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన నిందితులను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు.