హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NSJC కాలువకు 8 టీఎంసీల తాగునీరు!

PLD: నాగార్జునసాగర్ డ్యామ్‌ నుంచి ఆగస్టు 26 ఉదయం10 గంటలకు NSJC కాలువకు 8టీఎంసీల తాగునీటిని విడుదల చేయనున్నారు. ఐదు జిల్లాల్లోని 442 తాగునీటి చెరువులను నింపనున్నారు. నీటిని సాగుకు మళ్లించకుండా పల్నాడు జిల్లాలో 5 ప్రత్యేక బృందాలతో 24 గంటల గస్తీ ఏర్పాటు చేశారు. అక్రమంగా నీటిని మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.