కోనసీమ: అంతర్వేది సాగర సంగమం వద్ద కాకినాడకు చెందిన మత్స్యకారుల బోటు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. వేట ముగించుకొని వస్తుండగా అన్నాచెల్లెళ్ల గట్టు సమీపంలోని ఇసుక మేటల్లో బోటు చిక్కుకుంది. అందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. రక్షణకు వెళ్లిన మరో బోటుకు అలల తాకిడితో రంధ్రం పడటంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఆంధ్రప్రదేశ్
సాగర సంగమంలో మరో బోటు ప్రమాదం..!


