హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు..!

ELR: సత్తుపల్లి నుంచి చింతలపూడి వైపు వస్తున్న కారు బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యుత్ స్తంభం అడుగు భాగం విరిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.