KDP: దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు నుంచి అంతరాలయ దర్శనాన్ని నిలిపివేసి బాలాలయంలో భక్తులకు దర్శనం కల్పించారు. 3 రోజులుగా నిర్వహించిన అష్టబంధనం మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తికావడంతో నేటి నుంచి భక్తులకు దర్శనం అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఆలయంలో అంతరాలయ దర్శనం


