హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

NTR: తిరువూరులో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు మస్జిద్‌లలో ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించారు. జామియా మస్జిద్‌లో మతగురువు రిజ్వీ ప్రవక్త బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువల గురించి వివరించారు. ఇస్లాం గొప్పతనాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు.