ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలపై కేసులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రజల్లో ఉండి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని జగన్ సూచించారు. రాప్తాడులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్‌ను కలిసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి


