హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

GNTR: తెనాలి నాజరుపేటలో కార్పెంటర్ సువర్ణరాజు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త ఊపిరి ఆడడం లేదంటూ భార్య మాధవి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పరిశీలించిన వన్ టౌన్ పోలీసులు తల వెనుక బలమైన గాయం, మెడపై గొంతు బిగించిన ఆనవాళ్లు గుర్తించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.