PPM: కురుపాం మండలం మొండెంఖల్లు ప్రధాన జంక్షన్ సమీపంలోని ఆశ్రమ పాఠశాలకు వెళ్లే మార్గం బురదమయంగా మారింది.వీధి కాలువలో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లక రహదారిపై నిలిచిపోతోంది. దీంతో విద్యార్థులు,స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ నీటితో దోమలు పెరిగి విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
బురదమయమైన దారి.. విద్యార్థులకు ఇబ్బందులు


