హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలువూరులో తెరిచి ఉన్న నీటి వాల్వ్ చాంబర్!

GNTR: చిలువూరు గ్రామ కచేరి సమీప ప్రధాన రహదారిపై తాగునీటి పైప్‌లైన్ కంట్రోల్ వాల్వ్ చాంబర్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. దీంతో రాత్రి వేళల్లో పాదచారులు, వృద్ధులు, చిన్నారులు గుంతలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మూత ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.