హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరేచర్ల వద్ద రోడ్డు ప్రమాదం..!

GNTR: మేడికొండూరు మండలం కైలాసగిరి అడ్డరోడ్డు వద్ద మంగళవారం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో గుంటూరుకు చెందిన వీరాంజనేయులు (55) తీవ్రంగా గాయపడ్డారు. జూపిటర్ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాల పాలైన ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.