హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అమలాపురం రైతు బజార్‌కు సెలవు

కోనసీమ: అమలాపురం రైతు బజార్‌కు బుధవారం వారంతపు సెలవుగా నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ విశాలాక్షి తెలిపారు. రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇప్పటివరకు మంగళవారం ఉన్న సెలవును బుధవారానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి బుధవారం రైతు బజార్ మూసి ఉంటుందని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత కోరారు.