హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరాపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

సత్యసాయి: అమరాపురం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, లాకప్ గదులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరును పరిశీలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాత్రి గస్తీ, బీట్ పోలీసింగ్, వాహన తనిఖీలు పటిష్టం చేయాలని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు.