హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ

AKP: పరవాడ మండలం సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని మంగళవారం రాత్రి పునరుద్ధరించారు. మొదటి యూనిట్‌లో బాయిలర్ ట్యూబులకు రంద్రాలు పడటంతో ఈనెల 23వ తేదీన విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు చేపట్టారు. వార్షిక నిర్వహణ పనులు నిమిత్తం నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని అధికారులు గతంలోని నిలిపివేశారు.