కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలోని పాతబస్టాండులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి (50) మృతి చెందినట్లు సీఐ తిమ్మా రెడ్డి తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. మృతుని పేరు కొండయ్య అని స్థానికులు చెప్పారు. ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వ్యక్తి మృతి


