హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు'

నెల్లూరు: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవ రోజు అయినప్పటికీ బుధవారం విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేస్తాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.