హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీటీ జువాలజీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు: సీతారామపురం ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ జువాలజీ పోస్టుకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎంఎస్సీ జువాలజీ, బీఈడీ అర్హత తప్పనిసరి అని తెలియజేశారు. ఆగస్టు 29వ తేదీ లోపల దరఖాస్తులు సమర్పించాలన్నారు.