TPT: తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 34 మందికి రూ.3.40 లక్షల జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 7 మందికి రూ.2,100 జరిమానా పడింది. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 34 మందికి జరిమానా: ఎస్పీ


