హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: రామకుప్పం మండలంలోని విజలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వహకుడు మహేష్ రెడ్డి తెలిపారు. కుప్పం పీఈఎస్ ఆస్పత్రి కంటి వైద్య నిపుణులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల పాటు రోగులను పరిక్షిస్తారని చెప్పారు. అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలియజేశారు.