హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న కమలాపురంలో మెగా ఉద్యోగ మేళా

KDP: కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 29న ఉదయం 9 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 14 సంస్థలు పాల్గొని 850కుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు.