హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పెషల్ టెట్ డిమాండ్లు పరిష్కరించాలని వినతి

WG: స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భీమవరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ఎస్. విజయరామరాజు, పి. క్రాంతికుమార్ లు డీఈవోకి, డీఆర్వోకి వినతిపత్రం అందించారు.