హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకస్మిక వాహన తనిఖీలు: SI

VZM: గరివిడి SI లోకేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు నిన్న రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను ఆపి లైసెన్స్‌,వాహన పత్రాలు,హెల్మెట్‌ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రహదారి భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అక్రమ రవాణాను ఆరికట్టేందుకు ఆకస్మిక తనిఖీ చేశామన్నారు.