హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు కర్నూలు ఎస్పీ కీలక ఆదేశాలు

KRNL: జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. రానున్న గణేశ్ ఉత్సవాలు, దసరా, దేవరగట్టు బన్నీ ఉత్సవం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, పెండింగ్ కేసులు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తు వేగవంతం చేసి రికవరీలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.