హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేటి నుంచి విధుల్లోకి జూడాలు

VSP: స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌తో 15 రోజులుగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మె ముగిసింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో రాష్ట్ర కమిటీ జరిపిన చర్చలు ఫలించడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి జూనియర్‌ డాక్టర్లంతా యథావిధిగా విధులకు హాజరుకానున్న‌ట్టు జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు దినకర్ సాయి శ్రీనివాస్ తెలిపారు.