హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్ర.. ప్రజలతో పోలీసుల మమేకం

KDP: జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో SI సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, ఆస్తి నేరాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు.