హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెంచు కులస్తుల వినూత్న నిరసన

NRML: జిల్లా కలెక్టరేట్‌లో చెంచు కులస్తులు వినూత్న నిరసన చేపట్టారు. సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయింటాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చెంచుల సాంప్రదాయ వేషధారణలో కలెక్టరేట్‌కు వచ్చారు. తమకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్‌కు వినతి ఇచ్చారు. అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.