హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులాల్లో సీట్ల భర్తీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2026 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో 9వ తరగతి ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 29న పాల్వంచలో బాలురకు TGSWRS/JC(B), COE, బాలికలకు TGSWRS/JC(G)లో కౌన్సెలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులతో హాజరై అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు.