హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేత్రదానం చేయండి.. చిరంజీవులు అవ్వండి'

BHPL: 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఇవాళ BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. నేత్రదానం కుటుంబ సంప్రదాయంగా మారాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.