హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డెన్‌పై పోక్సో కేసు నమోదు

HNK: హసన్‌పర్తిలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులతో వార్డెన్ అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వార్డెన్ ప్రవర్తనపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.