హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల భద్రత విషయంలో రాజీ వద్దు'

KNR: ప్రజల భద్రత విషయంలో రాజీపడకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాన రహదారులను తరచూ తనిఖీ చేసి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాలన్నారు. రోడ్డుపక్కన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేయాలన్నారు.