హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొప్పాపూర్ ఉపకేంద్రంలో DMHO ఆకస్మిక తనిఖీ

SRCL: బొప్పాపూర్ ఉపకేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వైద్య సేవలు, మందుల లభ్యత, రికార్డుల నిర్వహణతో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.