BDK: భద్రాచలం నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం TGSRTC భద్రాచలం డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఇవాళ తెలిపారు. ఈ బస్సు పాల్వంచ, జగన్నాధపురం, దమ్మపేట, చింతలపూడి మీదుగా ద్వారకా తిరుమల వెళ్తుంది. పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.90 ఛార్జీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ద్వారక తిరుమలకు ప్రత్యేక బస్సులు..!


