WGL: శివనగర్‌లోని CPI ఆఫీసులో ఇవాళ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పర విమర్శలు, అంతర్గత కుమ్ములాటలకే పరిమితమవడం దురదృష్టకరమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తెలంగాణ
'ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం తగదు'


