హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యనగండ్లలో అద్భుత శిల్పకళ

MDK: కుల్చారం మండలం ఎనగండ్లలో అపురూపమైన శిల్పకళా సంపద వెలుగుచూస్తోందని చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. నల్లరాతిపై చెక్కిన గజలక్ష్మి శిల్పం అత్యంత ప్రత్యేకమైనదన్నారు. సాధారణంగా ఆలయ ద్వారబంధాల వద్ద కనిపించే గజలక్ష్మి రూపానికి భిన్నంగా, ఒకవైపు దేవతలు మరొకవైపు రాక్షసులు వాసుకి నాగుతో క్షీరసాగర మథనం దృశ్యం అద్భుతంగా చెక్కారని వివరించారు.