NLG: వన మహోత్సవంలో భాగంగా నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవం కింద 57 లక్షల 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
'ప్రతి మొక్కను సంరక్షించాలి'


