హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: MLA

WGL: గీసుగొండ (M) కొమ్మాల గ్రామంలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, సకాలంలో వర్షాలు కురిసేందుకు పచ్చదనం ఎంతో అవసరమన్నారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.