NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలో ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు, బ్యాంకు వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ రోజుల్లో సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై తిమ్మారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


