సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీని నిరసిస్తూ నినాదాలు చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్లకు అనుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హార్టికల్చర్ సీట్లపై విద్యార్థుల ఆందోళన


